ETV Bharat / city

తొలి 15 రోజులకు టీకాలు కేటాయింపు

తొలి 15 రోజులకు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం వ్యాక్సిన్ డోసుల్ని కేటాయించింది. వాటిలో రాష్ట్రానికి 9,17,850, తెలంగాణకు 8,35,960 డోసులు దక్కాయి.

vaccines
కొవిడ్ వ్యాక్సిన్స్
author img

By

Published : May 2, 2021, 7:44 AM IST

మే నెల తొలి 15 రోజులకు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2.12 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కొవిషీల్డ్‌ 1.62 కోట్లు కాగా, హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్‌ టీకా డోసులు 50 లక్షలు ఉన్నాయి. రాష్ట్రానికి 9,17,850, తెలంగాణకు 8,35,960 డోసులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌ 9, తెలంగాణ 12వ స్థానాల్లో నిలిచాయి.

52 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు..
ఆదివారం నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రానికి 73 వేలు, తెలంగాణకు 52 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి సదానందగౌడ్‌... శనివారం తెలిపారు. ఇప్పటికే ఏప్రిల్‌ 21 నుంచి మే 1వ తేదీ వరకు ఏపీకి 69,100, తెలంగాణకు 41,800 ఇంజక్షన్లను అందించినట్లు గుర్తుచేశారు.

నేడు 124.26 టన్నుల ప్రాణవాయువు రాక
ఒడిశా రాష్ట్రంలోని అనుగుల్‌లో ప్రాణవాయువును నింపుకొన్న రైలు 5 ట్యాంకర్లలో 124.26 టన్నుల ఆక్సిజన్‌ని తీసుకువస్తోంది. రెండు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఖాళీ ట్యాంకర్లతో ఒడిశాకు పంపించగా.. అందులో తొలి రైలు ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌కు చేరుకోనుంది.

ఇదీ చదవండి

ఆసుపత్రుల్లో డిశ్ఛార్జి డ్రైవ్.. పడకలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు

మోడెర్నా టీకాకు డబ్ల్యూహెచ్​ఓ పచ్చ జెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.