మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నేటి నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు అంతర్జాతీయ ప్రచారోద్యమం చేపడుతున్నామని దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ ఝాన్సీ విజయవాడలో తెలిపారు. విజయవాడలోని అంబేడ్కర్ భవన్లో నేటి నుంచి 16 రోజులపాటు దళిత , గిరిజన మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఈ ప్రచారోద్యమం చేపట్టామన్నారు.
ప్రభుత్వాలు చేపట్టాల్సిన ప్రచారోద్యమాలను రాష్ట్రంలో కనీసం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రచారంలో భాగంగా చిన్న వయస్సు నుంచి పిల్లలను చైతన్య పరచాలన్నారు. రాష్ట్రంలో దళిత, గిరిజన స్త్రీలపై జరుగుతున్న దాడులకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. తమ కార్యక్రమానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలన్నారు. దళిత, గిరిజన స్త్రీల రక్షణకై చేసిన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు.
చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యలను నిరసిస్తూ.. వర్ల దంపతుల 12 గంటల నిరసన దీక్ష