ETV Bharat / city

మా దగ్గర ధర తక్కువ.. పక్క రాష్ట్రాల్లోని పెట్రోలు బంకుల ప్రకటన

రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోవడంతో సరిహద్దు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకులు దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఆంధ్రాలోకంటే తమ వద్ద ధరలు తక్కువని.. ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని బోర్డులు, పాంప్లెట్లు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

border states petrol bunks advertising over their reduced prices

author img

By

Published : Nov 10, 2021, 4:25 PM IST

ఆంధ్రప్రదేశ్​తో పోల్చితే తమ వద్ద పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువంటూ.. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల్లో పెట్రోల్ బంకుల వద్ద పోస్టర్లు వెలుస్తున్నాయి. తమిళనాడులోని ఓ పెట్రోల్ బంకులో ఏపీ కంటే పెట్రోలు రూ. 4.73, డీజిల్ రూ. 8.20 తక్కువని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో బ్యానర్లు పెట్టారు. దీనికితోడు.. వంద లీటర్ల డీజిల్ కొన్నవారికి ఒక కేజీ బాస్మతి బియ్యం ఉచితమని ఉన్న ప్రకటన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తమ బంకులో ఇంధనం నింపుకుని డబ్బు ఆదా చేసుకోండంటూ ఆ ప్రకటనలో ఉంది.

ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ఓ కర్ణాటక పెట్రోల్ బంకులో.. ఏపీకంటే డీజిల్ రూ. 12, పెట్రోల్ రూ. 10 తక్కువంటూ ఉన్న కరపత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇదీ చదవండి:

Share bank: అప్పివ్వలేదని బ్యాంకునే పెట్టారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.