Book Exhibition in Vijayawada: విజయవాడ నగరంలోని స్వరాజ్యమైదానంలో.. బుక్ ఫెయిర్ ఘనంగా ప్రారంభమైంది. ఈ పుస్తక ప్రదర్శనలో.. లక్షల సంఖ్యలో పుస్తకాలు కొలువుదీరనున్నాయి. 210 స్టాళ్లలో దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలన్నీ తరలివచ్చి తమ పుస్తకాలను ఏర్పాటు చేయనున్నాయి.
నేటినుంచి పదకొండు రోజులపాటు.. విజయవాడ నగరంలో పుస్తకాలకు పట్టం కట్టనున్నారు. ఏటా మాదిరిగానే ఈసారి కూడా కనీసం ఏడు నుంచి పది లక్షల మంది పుస్తక ప్రియులు తరలివస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి : తూ.గో. జిల్లా ముమ్మిడివరం 12వ వార్డు కౌన్సిలర్ ఆత్మహత్య