15 నెలల్లో రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా.. అని బొండా ఉమా సవాల్ విసిరారు. 64 వేల కోట్ల రూపాయలను తెదేపా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకే ఖర్చు చేసిందన్న ఆయన.. ఈ ప్రభుత్వం లక్షకోట్లు అప్పుతెచ్చి, ప్రజలకు చిల్లర పంచి, మిగిలింది దోచేసిందని విమర్శించారు. రాష్ట్రం శాశ్వతం గానీ, వ్యక్తులు కాదనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని హితవు పలికారు. తమ జీవితాలు ఇప్పుడెందుకు తలకిందులయ్యాయో ప్రజలంతా ఆలోచించాలని బొండా ఉమా సూచించారు.
ఇదీ చదవండి: ఆర్థిక స్వావలంబన లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు చూశా: సీఎం