ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడం జగన్ ప్రభుత్వ అసహనానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి సొంత పార్టీ ఎంపీని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆరోపించారు. ఇది ముమ్మాటికి అనాలోచిత చర్యేనని ఆక్షేపించారు.
'ఎంపీని అరెస్టు చేయడం అన్యాయం'...
భావప్రకటనా స్వేచ్చను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి లేదని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు అన్నారు. రఘురామ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన ఆయన... న్యాయస్థానంలో రఘురామకు తప్పక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించకుండా ఒక పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేయటం అన్యాయమని ఆక్షేపించారు. విమర్శల ఆధారంగా కేసు పెట్టాల్సి వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గత ప్రభుత్వం హయాంలో ఎన్నోసార్లు అరెస్ట్ చేయాల్సి ఉండేదని ధ్వజమెత్తారు.
ఇదీచదవండి.