రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులు, అంతరాష్ట్ర సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై నేడు విజయవాడలో భాజపా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిచంనున్నట్లు ఎమ్మెల్సీ, భాజపా ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణా, గోదావరితో పాటు వివిధ నీటి వనరులు, వాటిలో నీటి లభ్యత, కొత్తగా కడుతున్న ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, పూర్తి స్థాయి నీటి వినియోగం, సవాళ్లపై ఉత్తరాంధ్ర, దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన నీటి పారుదల రంగ నిపుణులు చర్చలో పాల్గొంటారని వివరించారు.
ఇదీ చదవండి:
VIJAYSAI REDDY: రాష్ట్రానికి కేంద్రం ద్రోహం చేస్తోంది: విజయసాయిరెడ్డి