Somu Veerraju: పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై తెలంగాణ రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారని.. పోలవరంపై ప్రశ్నిస్తే రాష్ట్ర విభజన అంశాన్ని తిరగదోడినట్లేనని అన్నారు.
రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలన్న సోము వీర్రాజు.. 1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారని తెలిపారు. విభజన తర్వాత భద్రాచలం ఆలయం, మరో 2 మండలాలు తెలంగాణకు ఇచ్చారని.. దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా సాగర్‌కు నీరు ఇవ్వాలని వైఎస్ పనులు చేపట్టారని అన్నారు. దుమ్ముగూడెం వాళ్లకు ఇవ్వడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందన్నారు.
రాష్ట్ర విభజనపై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ భాజపాయేనని.. విలీనం చేసిన మండలాల్లో సీపీఎం ఆందోళన చేయడమేంటని ప్రశ్నించారు. పోలవరం విషయంలో.. సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం నిర్మాణం కేంద్రం పూర్తిచేస్తుందన్నారు.
ఇవీ చూడండి: