ETV Bharat / city

అక్రమ కేసులతో వేధిస్తున్నారు: అఖిల ప్రియ

author img

By

Published : Nov 12, 2019, 4:51 PM IST

తనను, తన భర్తను అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ మాజీ మంత్రి అఖిల ప్రియ రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు పోలీసుల మీద వ్యక్తిగతంగా చేసింది కాదని స్పష్టం చేశారు.

bhuma akilapriya comment on ycp govt

అక్రమ కేసులతో వేధిస్తున్నారని గవర్నర్​కు అఖిలప్రియ ఫిర్యాదు

తనపై, తన భర్తపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్​​కు ఫిర్యాదు చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్​ను మర్యాద పూర్వకంగా కలిసిన ఆమె.. తమపై పెట్టిన కేసుల గురించి ఆయనకు వివరించారు. తప్పుడు కేసులు అనడానికి గల ఆధారాలనూ గవర్నర్​కు అందజేసినట్లు అఖిలప్రియ వెల్లడించారు. వీటిని​ క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని గవర్నర్​ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఒక్క ఆళ్లగడ్డలోనే తెదేపా సానుభూతిపరులపై 40కి పైగా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో.. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆమె వెంట తెదేపా నేతలు కేశినేని నాని, నిమ్మల రామానాయుడు, మద్దాల గిరి, వర్ల రామయ్య ఉన్నారు.

ఇదీ చదవండి:

'రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోండి'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.