ETV Bharat / city

పేదల ఆకలి తీరుస్తున్న భారత్ వికాస్ పరిషత్

కరోనా విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి నిత్యం విధుల్లో శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పాటు నిరాశ్రయులకు ఆహారం అందిస్తున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. తమ సామర్థ్యం మేరకు ఆహారాన్ని అందిస్తూ పేదలు, కార్మికుల కడుపు నింపుతున్నాయి. విజయవాడ నగర పాలక సంస్థ పిలుపుమేరకు ముందుకు వచ్చిన భారత్ వికాస్ పరిషత్ సంస్థ.. రోజుకు 3 వేల మందికి భోజనం అందిస్తుంది.

Bharath vikas parishad
సేవలో మిన్న ఈ భారత్ వికాసులు
author img

By

Published : Apr 7, 2020, 2:32 PM IST

పేదల ఆకలి తీరుస్తున్న భారత్ వికాస్ పరిషద్

సామాజిక సేవలో భాగంగా దిల్లీ కేంద్రంగా 1963లో ఏర్పడిన భారత్ వికాస్ పరిషత్ సంస్థ.. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కరోనాతో యావత్ భారతం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో మరోసారి ఆపన్నహస్తం అందించేందుకు... విజయవాడ నగర పాలక సంస్థ పిలుపు మేరకు నగరంలోని పారిశుద్ధ్య కార్మికులు, పేదల కడుపునింపుతోంది. నిత్యం 3 వేల మందికి భోజనం ప్యాకెట్లు అందిస్తోంది.

భారత్ వికాస్ పరిషత్.. తమ సభ్యులు, స్నేహితుల నుంచి విరాళాలు సేకరించి సేవా కార్యక్రమాలు చేపడుతోంది. విజయవాడలోని మూడు సర్కిళ్లలో నిత్యం 2,500 మంది పారిశుద్ధ్య కార్మికులు, మరో 500 మంది నిరాశ్రయులకు భోజన వసతి కల్పిస్తోంది.

గత నెల చివరి వరకే ఆహారం పంపిణీ చేయాలని అనుకున్నా.... పరిస్థితి దృష్ట్యా లాక్ డౌన్ ఎంత కాలం పాటు కొనసాగితే అన్ని రోజులు 3 వేల మందికి భోజనం ఇవ్వాలని నిర్ణయించినట్లు సంస్థ సభ్యులు చెప్పారు.

ఇదీ చదవండి:

పీఎం కేర్స్ ఫండ్స్​కు గోకరాజు గంగరాజు విరాళం రూ. కోటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.