విజయవాడ నూతన సీపీగా బత్తిన శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషిచేస్తానని సీపీ స్పష్టం చేశారు. సాంకేతికతను ఉపయోగించి నేరస్థులను పట్టుకుంటామని... ఆన్‌లైన్ మోసాలను కట్టడి చేసేలా కృషి చేస్తామన్నారు. గంజాయి సరఫరాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమలరావు స్థానంలో బత్తిన శ్రీనివాసులు నియమితులయ్యారు. ఇంతకుముందు అదనపు సీపీగా బాధ్యతలు నిర్వహించిన ఆయనకు నగరంపై ఇప్పటికే తగినంత అవగాహన ఉంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న రౌడీయిజం, భూ సెటిల్‌మెంట్లు, ట్రాఫిక్ అవస్థలు, పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు, కిందిస్థాయిలో అవినీతి లాంటి సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.