AZADI RALLIES: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడ గ్రామీణ నున్న గ్రామంలో.. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఆధ్వర్యంలో.. తిరంగా రంగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి.. జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడులో.. 500 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. గ్రామ నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు.. ప్రదర్శనలో పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు.. 75 అడుగుల జాతీయ పతాకంతో.. పుర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. నినాదాలు చేస్తూ కరపత్రాలు పంచారు. మదనపల్లెలో 500 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ షరీఫ్, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెదిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, కలెక్టర్ గిరి షా.. ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలకు నృత్యాలు వేసి ఆకట్టుకున్నారు.
విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా తిరంగా ర్యాలీలో.. పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ నాయకుల వేషధారణలతో.. జాతీయ జెండాలను చేతబూని.. దేశభక్తి గీతాలు ఆలపించారు. గురజాడ కూడలిలో.. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, ఏక పాత్రాభినయాలు, గీతాలాపనులు ఆకర్షణగా నిలిచాయి.
ఇవీ చదవండి: