బీమా లబ్ధిదారులని కుదించారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తగ్గించిన బీమా లబ్ధిదారులను తిరిగి పునరుద్ధరించటంతో పాటు కుటుంబం మొత్తానికి పథకాన్ని అమలు చేయాలన్నారు. బీమా లబ్ధి మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.
'2019 జూన్ నుంచి గత ఏడాది అక్టోబర్ 10 వరకూ వైఎస్సార్ బీమాను అమలు చేయకుండా లబ్ధిదారులకు అన్యాయం చేశారు. తర్వాత చేసిన చెల్లింపుల్లోనూ ప్రభుత్వ తప్పిదాలు, కొర్రీలు కారణంగా అందరికీ సాయమందలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో నిధులు దుబారా లేకుండా కుటుంబం మొత్తానికి వర్తించేలా 2.47కోట్లమందికి బీమా సౌకర్యం కల్పించి రూ.4007 కోట్లు చెల్లింపులు చేశాం. జగన్ రెడ్డి ప్రభుత్వం 58 లక్షల మందికి బీమా లబ్ధిని దూరం చేయటంతో బీమా సంస్థల నిధులకు బదులుగా ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ప్రభుత్వ నిధుల్ని దుబారా చేస్తూ ప్రజలపై పన్నుల భారం మోపుతూ వారిని కష్టాలపాలు చేస్తున్నారు. సహజ మరణాలకు రూ.2 లక్షలు ఇచ్చిన చంద్రన్న బీమాను వైఎస్సార్ బీమాలో రూ.లక్షకు కుదించారు. 15 రోజుల్లో చేయాల్సిన చెల్లింపుల వ్యవధిని 45 రోజులకు పెంచారు. తక్షణమే ప్రజాధనం దుబారాను అరికట్టి పన్నుల పెంపు నిర్ణయాన్ని మానుకోవాలి.' అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పేదలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే.. వైఎస్ఆర్ బీమా: సీఎం జగన్