ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటనలో మృతిచెందిన రైతుల చితాభస్మం రాష్ట్రానికి చేరింది. సీఐటీయూ నాయకుడు, సీపీఎం నేత గఫూర్, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు దిల్లీ నుంచి చితాభస్మాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చితాభస్మాన్ని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డేశోభనాద్రీశ్వరరావుకు అందజేశారు. ఈ నెల 26 నుంచి ఆ చితా భస్మాన్ని రాష్ట్రంలోని ఏడు నదుల్లో కలపనున్నట్లు రైతు సంఘం నేతలు తెలిపారు. రైతుల మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, కేంద్రమంత్రి అజయ్ మిశ్రాని వెంటనే బర్తరఫ్ చేయాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.