తెలంగాణలో ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సమ్మె మూడో రోజుకు చేరింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. సమయానికి చికిత్స అందక.. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ మొదలుకొని... గుండెకు స్టంట్ వరకు నిరుపేదలు అనేక వైద్య సేవలు పొందేవారు. గత గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ సేవలు నిలిపివేసిన కారణంగా.. రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మెరుగైన చికిత్స కోసం వస్తున్న వారు.. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని చూపాల్సిన అవసరం ఉందని రోగులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: