ETV Bharat / city

APSRTC: నేటి నుంచి తెలంగాణకు బస్సులు - APSRTC has decided to run buses to Telangana

ఏపీఎస్‌ఆర్టీసీ
ఏపీఎస్‌ఆర్టీసీ
author img

By

Published : Jun 20, 2021, 5:23 PM IST

Updated : Jun 21, 2021, 3:38 AM IST

17:21 June 20

ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం కల్పించిన ఏపీఎస్‌ఆర్టీసీ

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) నేటి నుంచి తెలంగాణకు బస్సులు నడపనుంది.  సాయంత్రం 6 గంటలలోగా తెలంగాణలోకి ఆ బస్సు సర్వీసులు వెళ్లనున్నాయి. తెలంగాణలో బయలుదేరిన బస్సులు ఏపీలోని డిపోలకు సాయంత్రం 6 గంటల్లోపు చేరుకుంటాయి. నేటి నుంచి 120 సర్వీసులు నడిపేలా ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచనున్నారు. అంతర్‌రాష్ట్ర సర్వీసులకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఇంకా ఏపీఎస్‌ఆర్టీసీ సర్వీసులు పునరుద్ధరించలేదు. ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే సడలింపు ఉండటంతో దాదాపు అన్నీ ఉదయం సర్వీసులే నడపనున్నారు.

ఏపీ, కర్ణాటకలకు పాక్షికంగా టీఎస్‌ఆర్టీసీ బస్సులు

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో ఎత్తివేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకకు పాక్షికంగా బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండటంతో...  ఆ సమయంలోనే బస్సులను నడపనుంది. బెంగళూరు మినహా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు వేకువజామున 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు నడపనున్నారు. ఇవి నేటి నుంచి శుక్రవారం వరకు నడుస్తాయి.

ఇదీ చదవండీ... కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డు.. 10 లక్షల మందికిపైగా వ్యాక్సిన్లు

Last Updated : Jun 21, 2021, 3:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.