ETV Bharat / city

పెట్రో ధరల పెరుగుదలపై ప్రధాని వ్యాఖ్యలు హాస్యాస్పదం: తులసి రెడ్డి

సెంట్రల్ ఎక్సైజ్ పన్నుతో కేంద్రం.. వ్యాట్​తో రాష్ట్రం ఖజానాలు నింపుకొంటున్నాయని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి ఆరోపించారు. పెట్రో ధరల పెరుగుదలకు గత ప్రభుత్వాలు కారణమన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోకపోతే తమిళనాడు, బంగాల్ ఎన్నికల్లో భాజపాకు పరాజయం తప్పదని హెచ్చరిచారు.

apcc working president tulasireddy condemned pm modi words on petrol prices hike
పెట్రో ధరల పెరుగుదలపై ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన తులసిరెడ్డి
author img

By

Published : Feb 18, 2021, 4:16 PM IST

పెట్రో ధరల పెంపునకు గత ప్రభుత్వాలే కారణమన్న ప్రధాని వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. గత ఆరేళ్లుగా మోదీ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. సెంట్రల్ ఎక్సైజ్ పన్ను పెంపుతో కేంద్రం.. వ్యాట్​తో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలు నింపుకొంటున్నాయని మండిపడ్డారు. ధరలు తగ్గించడంపై చిత్తశుద్ధి ఉంటే ఆయా పన్నుల్లో కోత విధించాలని డిమాండ్ చేశారు.

పంజాబ్ మున్సిపల్ ఎన్నికల ఫలితలతోనైనా కనువిప్పు కలిగి.. రైతు వ్యతిరేక చట్టాలను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి సూచించారు. కేంద్రం తీరు మారకుంటే.. త్వరలో జరగనున్న తమిళనాడు, బంగాల్ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఎంపీ కేశినేని సమక్షంలో తెదేపా శ్రేణుల వాగ్వాదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.