Sailajanath on prices hike: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో భాజపా, వైకాపా ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ధరలు పెంచితే.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ చప్పట్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. చట్టాల పట్ల ఏమాత్రం అవగాహన లేని మంత్రులు తాము ఏమైనా చేయొచ్చని మాట్లాడటం వారి అవగాహనరాహిత్యానికి నిదర్శనమని అన్నారు. విశాఖ ఉక్కు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి అంశాల్లో కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఎంత పెరిగాయంటే..?