ETV Bharat / city

High Court: డిస్కంలు కోరడం విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే: హైకోర్టు - విద్యుత్ కొనుగోలు

విద్యుత్ కొనుగోలు ఒప్పందం నిబంధనలను సవరించి, యూనిట్ టారిఫ్ ధరను తగ్గించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు, ఏపీ విద్యుత్ నియంత్రణ మండలిని కోరడం సరికాదని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరపు సీనియర్ న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. టారిప్ ధరను కుదించాలని ఏపీ ఈఆర్సీని డిస్కంలు కోరడం విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు.

High Court
High Court
author img

By

Published : Aug 12, 2021, 4:23 AM IST

విద్యుత్ కొనుగోలు ఒప్పందం నిబంధనలను సవరించి, యూనిట్ టారిఫ్ ధరను తగ్గించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు, ఏపీ విద్యుత్ నియంత్రణ మండలిని కోరడం సరికాదని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరపు సీనియర్ న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. టారిప్ ధరను కుదించాలని ఏపీ ఈఆర్సీని డిస్కంలు కోరడం విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు. పీపీఏల జోలికి వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. యూనిట్ టారిఫ్ ధరలను ఏపీఈఆర్సీ సమీక్షించలేదని పునరుద్ఘాటించారు. ఓ సారి నిర్ణయించాక యూనిట్ టారిఫ్​ను తగ్గించడానికి వీల్లేదన్నారు.

తాజాగా జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాదులు సంజయ్ సేన్, సి.రఘురాం వాదనలు వినిపించారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎస్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏ యూనిట్ టారిఫ్ ధరలను ఏపీఈఆర్సీ సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు.

ఇదీ చదవండి:

Amit Sha Srisailam Tour: నేడు శ్రీశైలానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Covid: 5 రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.