ETV Bharat / city

పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ap-high-court-on-parishath-elections
ap-high-court-on-parishath-elections
author img

By

Published : Apr 6, 2021, 3:59 PM IST

Updated : Apr 7, 2021, 6:07 AM IST

15:58 April 06

రాష్ట్రంలో ఈనెల 8వ తేదీన జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఎన్నికల నిమిత్తం ఈనెల 1న ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా జరిగే తదుపరి చర్యలన్నింటినీ ఆపేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ తాజాగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చి.. ఆ వివరాలతో ఈనెల 15న హైకోర్టులో అఫిడవిట్‌ వేయాలని పేర్కొంది. దానిని పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల కోడ్‌ విధించే విషయంలో సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎస్‌ఈసీ ఈనెల 1న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం నోటిఫికేషన్‌ జారీ చేసిందని పేర్కొంటూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల వరుసగా విచారణ జరిపిన న్యాయమూర్తి మంగళవారం తన నిర్ణయాన్ని వెల్లడించారు.

‘పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధించాలని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొందని హైకోర్టు తెలిపింది. కోడ్‌ విధించే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఎస్‌ఈసీ అనుసరించలేదని ఆక్షేపించింది. ఆ ఉత్తర్వులను తోసిపుచ్చుతూ ఎస్‌ఈసీ ఏకపక్షంగా సొంత నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఎన్నికలు నిర్వహించడం అలంకారప్రాయ తంతుకాదని హితవు పలికింది. సాధారణమైన వ్యక్తి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొని నచ్చిన అభ్యర్థి, పార్టీని ఎన్నుకునేలా ఎన్నికలు ఉండాలని ‘విన్‌స్టన్‌ చర్చిల్‌’ చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్‌) పోలింగ్‌ తేదీకి 4 వారాల ముందు విధించకపోతే.. పోటీదారులందరికీ సమానమైన అవకాశం కల్పించామని చెప్పుకునే నైతిక హక్కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎస్‌ఈసీ) ఉండదని చెప్పింది. తద్వారా ఎన్నికల ప్రక్రియ అంతా నీరుగారిపోతుందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌ఈసీ చర్యలు లేవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలకు అవరోధం కలుగుతుందని వెల్లడించింది. సాధారణంగా ఎన్నికల నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోనప్పటికీ.. ప్రస్తుత వ్యవహారంలో ఎస్‌ఈసీ నిర్ణయంపై తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఎన్నికల విషయంలో అధికరణ 226 కింద న్యాయ సమీక్ష చేయకూడదనడం అవాస్తవం అని పేర్కొంది.

ఎస్‌ఈసీ, ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేం

‘4 వారాల ముందు కోడ్‌ విధించాలన్న సుప్రీం ఆదేశాలు గరిష్ఠ కాలపరిమితి మాత్రమేనన్న ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేం. రాజ్యాంగబద్ధ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం అందరిపై ఉంది. రాజ్యాంగబద్ధ అథార్టీగా ఎస్‌ఈసీ.. సుప్రీం ఆదేశాలను నిరాకరించడానికి వీల్లేదు. ఆ ఆదేశాల్ని అమలు చేయడం తప్ప ఎస్‌ఈసీకి మరో మార్గం లేదన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవిస్తున్నాం. నాలుగు వారాల ముందు కోడ్‌ అమలు చేసే విషయంలో ఇబ్బంది ఎదురైతే ఎస్‌ఈసీ సుప్రీంకోర్టు నుంచి తగిన ఆదేశాలు పొంది ఉండాల్సింది. కోడ్‌ విధించడం ద్వారా అందరికి సమానమైన అవకాశాలు కల్పించేలా, బరిలో ఉన్న వాళ్లందరూ నియమావళిని పాటించేలా చూడాలి. సామాన్యుడు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాలి’ అని హైకోర్టు పేర్కొంది.

సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘించడమే

తెదేపా నేత వర్ల రామయ్య తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ‘సుప్రీంకోర్టు ఎన్నికల కోడ్‌ను పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందుగా విధించాలని ఆదేశించాక ఆ ఉత్తర్వులను అనుసరించడం తప్ప వేరే మార్గం లేదు. ఈనెల 1న నోటిఫికేషన్‌ ఇచ్చి అదే రోజు నుంచి ఎన్నికలు ముగిసే వరకు కోడ్‌ విధించడం సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘించడమే. కోడ్‌పై సందేహం ఉంటే సుప్రీంను ఆశ్రయించి స్పష్టత తెచ్చుకోవాలి. గతేడాది మార్చిలో కరోనా కారణంగా ఎస్‌ఈసీ ఎన్నికలను వాయిదా వేయడంతో ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ వాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి తదుపరి ఎన్నికల తేదీకి 4 వారాల ముందు కోడ్‌ను పునర్‌విధించాలని ఎస్‌ఈసీని గతేడాది మార్చి 18న ఆదేశించింది. ఆ ఉత్తర్వులను ఎస్‌ఈసీ తుంగలో తొక్కింది’ అని పేర్కొన్నారు.

కోడ్‌ విధించాలన్న నిబంధన లేదు

పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలనే చట్ట నిబంధన లేదని ఎస్‌ఈసీ తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. ‘తెదేపా నేత వర్ల రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు. ప్రజాహితం కోసం వేస్తే ప్రస్తుత వ్యాజ్యాన్ని ధర్మాసనం వద్ద విచారించాలి. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎస్‌ఈసీ కోడ్‌ను ఎత్తివేయని కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోతాయని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో కోడ్‌ను సడలించిన సర్వోన్నత న్యాయస్థానం.. మళ్లీ నిర్వహించే పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలని స్పష్టత నిచ్చింది. ఆ ఉత్తర్వులను ఆదేశాలుగా పరిగణించకూడదు...’ అని వివరించారు.

అది ఎస్‌ఈసీ విచక్షణాధికారమే

కరోనా కారణంగా గతేడాది నిలిచిపోయిన ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించాలా? లేదా నిలిచిపోయిన దగ్గర్నుంచి నిర్వహించాలా?అనే విషయంలో ఎస్‌ఈసీకే విచక్షణాధికారం ఉంటుందని హైకోర్టు స్పష్టత నిచ్చింది. నిలిచిపోయిన దగ్గర్నుంచి నిర్వహిస్తే.. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు నిరాకరించినట్లేనని పిటిషనర్లు చేసిన వాదనతో ఏకీభవించలేమని పేర్కొంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, మరో ముగ్గురు దాఖలుచేసిన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులివ్వడానికి న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు నిరాకరించారు. అనుబంధ పిటిషన్‌ను కొట్టేశారు.

ఇదీ చదవండి:

తెలుగుపై మమకారం- మాతృ భాషంటే ప్రాణం

Last Updated : Apr 7, 2021, 6:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.