ETV Bharat / city

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌

Justice Battu Devanand visits old age home: విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్నిసందర్శించారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్. వృద్ధుల మధ్య కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. నగర కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ దంపతులతో కలిసి వృద్ధులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు.

AP High Court Judge Justice Battu Devanand

author img

By

Published : Jan 1, 2022, 3:25 PM IST

Updated : Jan 1, 2022, 4:28 PM IST

Justice Battu Devanand visits old age home: విజయవాడ నగర శివారు రాజీవ్ ​నగర్​లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సందర్శించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నగర మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ దంపతులతో కలిసి వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం కేక్ కట్ చేసి.. కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ బట్టు దేవానంద్.. ఇటువంటి వృద్ధాశ్రమాలను ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని కోరారు. అవసాన దశలో ఉన్న వృద్ధులు రోడ్డుపాలు కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌

నగర పాలక సంస్థ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ వృద్ధాశ్రమం.. చక్కటి సేవలు అందిస్తోందని ప్రశంసించారు. ఇక్కడకు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్​ దంపతులతోపాటు.. జస్టిస్ దేవానంద్ స్వయంగా వృద్ధులకు భోజనాన్ని వడ్డించారు.

ఇదీ చదవండి :

MP RAGHURAMARAJU: జైలుకెళ్లే వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు: ఎంపీ రఘురామ

Last Updated : Jan 1, 2022, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.