ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు, ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. 180.19 కోట్లు వెచ్చించి రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలు కొనుగోలు చేయాలనీ నిర్ణయించారు. దీనికోసం 46.08 కోట్లు వెచ్చించనున్నారు.
ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో సివిల్, ఎలక్ట్రిక్ పనుల కోసం 25.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. 50 కోట్లతో 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రాబోయే 6 నెలలకు 60 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఏపీ మెడికల్ సర్వీసెస్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీని ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండి:
హైదరాబాద్కు కర్నూలు పోలీసులు.. చంద్రబాబుకు నోటీసులిచ్చే అవకాశం!