రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర తినుబండారాల దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకూ తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. బార్ అండ్ రెస్టారెంట్లు మినహా ఇతర హోటళ్లు, ఈటరీస్‌ను ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ తెరిచి ఉంచేందుకు కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దుకాణాలు - సంస్థల చట్టం 1988 సెక్షన్ 7ను అనుసరించి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కంది.
రాష్ట్రంలో హోటల్ పరిశ్రమకు చెందిన సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2022 మార్చి 14 తేదీ నుంచి ఎలాంటి కొవిడ్ నిషేదాజ్ఞలు అమల్లో లేనందున హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 12 వరకూ తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.
ఇవీ చూడండి