జగనన్న విద్యా దీవెనకు అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులపై.. ఫీజుల చెల్లింపు కోసం ఒత్తిడి తేవద్దంటూ.. ప్రైవేటు కళాశాలలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అడ్మిషన్ల సమయంలో ఫీజులు చెల్లించాలని వారిని ఇబ్బంది పెట్టకుండా చూడాలని ఉన్నత విద్యాశాఖను ఆదేశించింది.
లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నాలుగు విడతలుగా నిధులు జమ చేస్తున్నామని తెలియచేసింది. నిధులు విడుదల చేసిన వారంలోగా సదరు ఫీజును కళాశాలలకు చెల్లిస్తారని స్పష్టం చేసింది. సరైన కారణం లేకుండా చెల్లించకపోయినా.. పథకం ద్వారా పొందిన డబ్బును తల్లిదండ్రులు దుర్వినియోగం చేసినా ప్రభుత్వానిది బాధ్యత కాదని ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి: