ఐసొలేషన్ కేంద్రాలకు పీపీఈ కిట్లు
కరోనా లక్షణాలున్న వారి కోసం ప్రతీ పరీక్ష కేంద్రంలో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటివి 5శాతం ఉంటాయి. ఇక్కడ విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు అందించనున్నారు. ఇటీవల కర్ణాటకలో కేసెట్ నిర్వహణకు అవలంబించిన విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆవరణలోకి ప్రవేశించే వారికి థర్మల్ స్కానింగ్ చేస్తారు. ప్రతీ రోజు శానిటైజ్ చేస్తారు. ఇన్విజిలేటర్లకు మాస్కులు, గ్లౌజ్‌లు అందిస్తారు. మరుగుదొడ్లు, పరీక్ష కేంద్రాల వద్ద సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు.
కరోనా పాజిటివ్ వారికి ఏదో ఒక రోజు
కరోనా పాజిటివ్ విద్యార్థులకు ఎంసెట్ నిర్వహించే వారం రోజుల్లో ఏదో ఒక రోజు పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు. కరోనా బారిన పడిన, రెడ్‌జోన్‌లో ఉన్న వారికి రవాణా సదుపాయం కల్పించేందుకు జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించనున్నారు.
ఇదీ చదవండి: ఎస్పీ బాలుకు అస్వస్థత- ఐసీయూలో చికిత్స