Cabinet: సచివాలయంలో ఉదయం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజల నుంచి విజ్ఞప్తులు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం... కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరును ఖరారు చేసింది. అమ్మఒడి పథకం కింద ఈనెల 27న 43 లక్షల పైచిలుకు తల్లుల ఖాతాల్లో 6వేల 594 కోట్లు జమ చేసేందుకు అంగీకారం తెలిపింది. 2025 నాటికి సీబీఎస్ఈ సిలబస్‌లో పరీక్షలు రాయడమే లక్ష్యంగా ఈ ఏడాది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్చర్ జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు తీసుకొచ్చిన జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.13 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్పీ ఛైర్మన్లే.... 26 జిల్లాలకు కొనసాగేలా పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది.
ఆక్వా రైతులకు ఇప్పటి వరకు 5 ఎకరాలలోపు వరకే రాయితీ విద్యుత్ అందిస్తుండగా...దీన్ని 10 ఎకరాలకు పెంచారు. ఎట్టకేలకు తిత్లీ తుపాన్ బాధితులకు అదనపు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చేందుకు మంత్రివర్గం తీర్మానించింది. దుల్హన్ పథకం నిలిపివేత వివాదంపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సూటిగా సమాధానమివ్వలేదు.
ఇవీ చూడండి: