పార్టీ కోసం కష్టపడేవారికి సముచిత స్థానం ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఆధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నరసరావుపేట, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాలకు తెదేపా కమిటీలను చంద్రబాబు ఖరారు చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం తెదేపా కమిటీ సభ్యుల జాబితాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.
పార్టీ నేతలు జవహర్ అధ్యక్షతన 36 మందితో రాజమహేంద్రవరం తెదేపా కమిటీ, జీవీ ఆంజనేయులు అధ్యక్షతన 36 మందితో నరసరావుపేట తెదేపా కమిటీని అధినేత ప్రకటించారు.
ఇదీ చదవండి..
cross firing: మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు.. ఆరుగురు మృతి?!