నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు తెదేపా కమిటీలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, అరకు, ఏలూరు పార్లమెంట్ స్థానాలకు కమిటీ సభ్యుల వివరాలను ఆ పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికి 30 మందికి పైగా సభ్యులను నియమించారు.
- శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి కూన రవికుమార్ అధ్యక్షతన మొత్తం 36మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో అత్యధికంగా 32మంది బీసీలకు అవకాశం కల్పించారు. మిగిలిన నలుగురిలో ఇద్దరు ఎస్సీలకు, ఓసీ, ఎస్టీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు.
- విజయనగరం పార్లమెంట్ స్థానానికి కిమిడి నాగార్జున అధ్యక్షతన మొత్తం 33మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో 23 మంది బీసీలకు చోటు కల్పించారు.
- గుమ్మడి సంధ్యారాణి అధ్యక్షతన 32 మందితో అరకు పార్లమెంట్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో 18 మంది బీసీలకు, 12 మంది ఎస్టీలకు పదవులు దక్కాయి.
- గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన 32 మందితో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీని ఖరారు చేశారు. ఇందులో 13 మంది బీసీలు, ఒక మస్లిం మైనార్టీ, ముగ్గురు ఎస్సీలకు, 15మంది ఓసీలకు పదవులు దక్కాయి.
- మొత్తంగా నాలుగు పార్లమెంట్ స్థానాలకు కలిపి 133 మంది సభ్యులను నియమించగా..అందులో 86 మంది బీసీలకు చోటు కల్పించారు.
ఇదీచదవండి
sonu sood - chandrababu: చంద్రబాబు ఐక్య కార్యాచరణకు సోనూసూద్ ఓకే !