ETV Bharat / city

Akhanda Team visit Indrakeelardi: కథ నచ్చితే మల్టీస్టారర్​కు రెడీ: బాలకృష్ణ

author img

By

Published : Dec 15, 2021, 8:03 AM IST

Updated : Dec 15, 2021, 8:46 PM IST

Akhanda Team visit Indrakeelardi: విజయవాడలో అఖండ చిత్ర బృందం పర్యటించింది. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను బాలకృష్ణ, బోయపాటి దర్శించుకున్నారు. దర్శకులు మంచి కథతో వస్తే..మల్టీస్టారర్‌ చేస్తానని బాలయ్య స్పష్టం చేశారు.

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నీధిలో 'అఖండ' బృందం సందడి
Akanda Team visit Indrakeelardi temple

దుర్గమ్మను దర్శించుకున్న అఖండ చిత్ర బృందం

Akhanda Movie Team Visit Vijayawada Durga Temple: విజయవాడలో అఖండ చిత్ర బృందం సందడి చేసింది. ఇంద్రకీలాద్రిపై బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ప్రముఖ దర్శకులు, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.. దుర్గ గుడిని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి బాలకృష్ణ సంప్రదాయ దుస్తులతో వచ్చారు. స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు.. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అఖండ ఘనవిజయం సాధించడం పట్ల బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని చూపించిన సినిమా అఖండ అని అమ్మవారి ఆశీస్సులతో ప్రేక్షకులు విజయాన్ని అందించారని బాలకృష్ణ పేర్కొన్నారు. అఖండ విడుదలై ఘన విజయం సాధించాక ధైర్యం వచ్చిందన్న బాలకృష్ణ.. దర్శకులు ముందుకొచ్చి కథ నచ్చితే మల్టీస్టారర్‌ చేస్తానని తెలిపారు.

టికెట్ విధానంపై చిత్రం విడుదలకు ముందు చర్చించాం. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది.. ఏం జరుగుతుందో చూద్దాం. చిత్ర పరిశ్రమను తప్పకుండా కాపాడతాం.- బాలకృష్ణ

అంతకుముందు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సినీనటుడు బాలకృష్ణ, అఖండ సినిమా బృందానికి బొర్రా గాంధీ, కరుణాకర్ బృందం స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో బాలయ్యతో సెల్ఫీలు తీసుకొనేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడినుంచి నేరుగా విజయవాడ దుర్గ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నీధిలో 'అఖండ' బృందం

అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అఖండ సినిమా బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అఖండ ఆగమనంతో ఆయన అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఆలయ పరిసర ప్రాంగణం జై బాలయ్య నినాదాలతో మారుమోగింది.అభిమానులంతా తమ నటసింహాన్ని చూసేందుకు ఒక్కసారిగా వచ్చారు. చిరునవ్వుతో వారిని పలకరించి సెల్పీలు దిగారు.

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నీధిలో 'అఖండ' బృందం సందడి

ముక్కంటి సేవలో బాలయ్య..

శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను ఇవాళ సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ మేధో దక్షిణామూర్తి సన్నిధిలో ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు.

ఇదీ చదవండి..

mahapadayatra: ముగిసిన అన్నదాతల యాత్ర...అమరావతిని రక్షించాలని స్వామీకి విన్నపం

Last Updated : Dec 15, 2021, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.