అమర్ రాజా కంపెనీ పొల్యూషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీజ్ చేస్తూ పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్టు దాఖలు చేయకపోవటంతో మూడు వారాలు స్టే పొడిగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. కంపెనీ సీజ్ చేస్తూ పీసీబీ ఇచ్చిన ఆదేశాలపై గతంలోనే హైకోర్టు స్టే విధించింది. ఆ స్టే ను తాజాగా న్యాయస్థానం పొడిగించింది.
ఇదీ చదవండి