ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 5 వరకు ఆయన సస్పెన్షన్ కొనసాగనుంది. అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన ప్రాథమిక నివేదిక పై సివిల్ సర్వీసెస్ అధికారుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. దీనికి సంబంధించి తగిన కార్యాచరణ చేపట్టాల్సిందిగా డీజీపీని ఆదేశిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
ఇవీ చదవండి