ETV Bharat / city

నల్ల ధాన్యం సాగు...దిగుబడులు బాగు - black rice news

విజయవాడ నగర శివారు రామవరప్పాడు గ్రామంలో నల్ల వరి సాగుకు శ్రీకారం చుట్టాడు ఓ రైతు. తనకున్న ఐదుకెరాల పొలంలో బీపీటీ 2841 రకానికి చెందిన నల్ల ధాన్యం సాగు చేసి...మంచి దిగుబడి సాధిస్తున్నాడు.

A farmer started cultivating black rice in Ramavarapadu village in Vijayawada suburb.
నల్ల వరి సాగు
author img

By

Published : Nov 15, 2020, 12:03 PM IST

విజయవాడ నగర శివారు రామవరప్పాడు గ్రామంలో సుంకర రమేష్ బాబు అనే రైతు నల్ల బియ్యం సాగు ఉపక్రమించారు. అందరి రైతులలా కాకుండా వినూత్నంగా ఆలోచించిన రైతు రమేష్.... కార్ బీపీటీ 2841 రకానికి చెందిన నల్ల ధాన్యం సాగు చేపట్టారు. బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి తీసుకొచ్చిన ఈ నల్ల ధాన్యం ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో సాగు చేయగా... ఆశించిన రీతిలో దిగుబడి వచ్చిందని రైతు ఆనందం వ్యక్తం చేశాడు.

నల్ల వరి సాగు

ఈ బీపీటీ 2841 రకం ధాన్యంలో పోషక విలువలు ఆధికంగా ఉంటాయన్నారు. జింక్, ప్రోటీన్స్... ఇతర రకాల బియ్యం కంటే ఎక్కువగా ఉండటం వల్ల...దీనికి మార్కెట్​లో మంచి డిమాండ్ ఉందని రైతు రమేష్ బాబు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ పరిస్థితులలో రోగ నిరోధక శక్తి పెంచుకోవటానికి పోషక విలువలు కలిగిన ఈ నల్ల ధాన్యం చక్కగా ఉపయోగ పడతాయని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ నల్ల ధాన్యం విత్తనాలు సరఫరా చేస్తే మరి కొంత మంది రైతులు సాగు చేయడానికి ముందుకొస్తారని రైతు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:
పులికాట్ సరస్సులో విదేశీ పక్షుల సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.