ETV Bharat / city

తెలంగాణ: ఐసోలేషన్​ కేంద్రంలో 11 మంది మృతి - మంచిర్యాలలో కరోనా మృతుల సంఖ్య

తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఐసోలేషన్​ కేంద్రంలో 36 గంటల వ్యవధిలో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. పరిస్థితి విషమించిన తర్వాత ఐసోలేషన్‌కు రావడం వల్లనే మృతుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు తెలిపారు.

ఐసోలేషన్​ కేంద్రంలో 11 మంది మృతి
ఐసోలేషన్​ కేంద్రంలో 11 మంది మృతి
author img

By

Published : May 6, 2021, 1:24 PM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ ప్రాణాలు బలితీసుకుంటోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఐసోలేషన్​ కేంద్రంలో వరుస కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. 36 గంటల వ్యవధిలో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు 8మంది మృతి చెందారు.

ఇవాళ ఉదయం 8 నుంచి ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఐసోలేషన్​కు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. పరిస్థితి విషమించిన తర్వాత ఐసోలేషన్‌కు రావడం వల్లనే మృతుల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

కొవిడ్ వైద్య చికిత్సలపై హైకోర్టులో విచారణ.. సర్కార్ తీరుపై అసంతృప్తి

కరోనా వ్యాప్తి నివారణకు ఎంపీ మిథున్‌రెడ్డి రూ.కోటి విరాళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.