తెలంగాణలో కొత్తగా మరో 55 మందికి కరోనా వైరస్ సోకింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 44 మందిలో పాజిటివ్ నిర్ధరణ కాగా, సంగారెడ్డిలో ఇద్దరికి, రంగారెడ్డిలో ఒకరికి కరోనా వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన 8 మంది వలసజీవుల్లో కూడా వైరస్‌ను గుర్తించారు. మొత్తంగా వలసజీవుల్లో ఇప్పటి వరకూ పాజిటివ్ వచ్చినవారి సంఖ్య 52కు చేరింది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1,509కు పెరిగింది.
ఇవాళ 12 మంది డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు 971 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. ఆస్పత్రుల్లో 504 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 34 మంది మృతిచెందారు.