విజయవాడలోని బందర్ రోడ్డులో వంగవీటి మోహన రంగా 32వ వర్ధంతిని నిర్వహించారు. విక్టోరియా మ్యూజియం ఎదురుగా ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి.. ఆయన సేవల్ని స్మరించుకున్నారు. జిల్లాలోని వేర్వేరు చోట్ల రంగా విగ్రహాలను ఆయన తనయుడు రాధా ఆవిష్కరించారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ పార్క్ రోడ్డులో దివంగత నేత వంగవీటి మోహనరంగా వర్ధంతి నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
విజయవాడలోని వైకాపా కార్యాలయం వద్ద వంగవీటి మోహన రంగా వర్ధంతి జరిగింది. రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన జీవితకాలమంతా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని ఎమ్మెల్యే రమేశ్ బాబు పేర్కొన్నారు. వైకాపా నియోజకవర్గ అధికార ప్రతినిధి, అవనిగడ్డ, ఘంటసాల మండలాల కన్వీనర్లు, రంగా మిత్ర మండలి దివి యూనిట్ అధ్యక్షుడు, అభిమానులు పలువురు నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా మొవ్వ మండలం మొవ్వపాలెం గ్రామంలో వంగవీటి రంగా 32వ వర్ధంతి జరిగింది. వంగవీటి మోహన రంగా 'ఒక వ్యక్తి కాదు శక్తి' అని పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు.
కడప జిల్లా రైల్వే కోడూరులో వంగవీటి రంగా 32వ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి..నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా, తెదేపా నాయకులు, వంగవీటి అభిమానులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు నాయకుడిగా వంగవీటి మోహన రంగా పేరు తెచ్చుకున్నారని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. రంగా వర్ధంతి సందర్భంగా గన్నవరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి: