ఉచిత అంబులెన్స్(108 ఎమర్జెన్సీ)లో పనిచేస్తున్న ఈఎంటీ పైలట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి... సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... విజయవాడ నగరంలోని గాంధీనగర్లో వైఎస్సార్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. గత 13 ఏళ్ల నుంచి రోజుకు 12 గంటలు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ అంబులెన్స్ డ్రైవర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ సంస్థల లాభార్జన ధ్యేయంతో.. లక్ష్యం నీరుగారుతోందని నినాదాలు చేశారు. రెండేళ్లు గడుస్తున్నా... పాత నిర్వహణ సంస్థ జీవీకే, ఈఎంఆర్ఐ నుంచి రావాల్సిన బకాయిలు రాలేదని.. వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 108 ఎమర్జెన్సీ ఉచిత అంబులెన్స్ వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు.
ఇదీ చదవండీ...