తితిదే ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జి.వాణి మోహన్ ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో అదనపు ఈవో ధర్మారెడ్డి ఆమెతో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ ను అందించారు.
ఇదీ చదవండి: