తిరుమలలోని అంజనాద్రి పర్వతమే ఆంజనేయస్వామి జన్మస్థలమని (Hanuman birth place) వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉందని శ్రీ కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి స్పష్టం చేశారు. తితిదే (TTD) శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై శుక్రవారం తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో రెండు రోజుల అంతర్జాతీయ వెబినార్ ప్రారంభమైంది. కార్యక్రమంలో భారతీ మహాస్వామి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు.
అనేక పురాణాల్లో అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని (Hanuman birth place) పేర్కొన్నట్లు భారతీ మహాస్వామి వివరించారు. అంతకుముందు తితిదే ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశోధించి అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమని (Hanuman birth place) పండిత పరిషత్ నిర్ధారణ చేసిందన్నారు. పండితులు ఆధారాలతో సహా ప్రకటించాక పుస్తకాన్ని విడుదల చేశామని ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఆహ్వానించామన్నారు.
అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారితో చర్చ పెట్టామన్నారు. అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. అనంతరం మహీంద్రా వర్సిటీ న్యాయ కళాశాల డీన్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. 2007లో అక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ముద్రించిన హనుమాన్స్ కేం పుస్తకంలో కూడా అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని (Hanuman birth place) రాశారని పేర్కొన్నారు. తితిదే కంటే కొన్ని దశాబ్దాల ముందే చాలామంది ఈ విషయాన్ని రాశారని తెలిపారు.
పండిత పరిషత్ పరిశోధనలు ప్రపంచానికి తెలియడానికే వెబినార్ నిర్వహిస్తున్నామని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ, పండిత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య వి.మురళీధర్ శర్మ చెప్పారు. ఈ విషయంపై అందరి అభిప్రాయాలు సేకరించి సమగ్రంగా పుస్తకం ముద్రిస్తామని అన్నారు. వీరితోపాటు జీవా డైరెక్టర్ ఆచార్య సముద్రాల రంగ రామానుజాచార్యులు, పుణె దక్కన్ కళాశాల ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య వెంకపటి కుటుంబరావు శాస్త్రి, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డైరెక్టర్ శంకరనారాయణ, ఆర్కియాలజీ అండ్ మ్యూజియం విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ విజయ్‌కుమార్, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ఎ.ప్రసన్నకుమార్, విశ్రాంత సంస్కృతోపన్యాసకులు ఇ.సింగరాచార్యులు, చారిత్రక పరిశోధకులు గోపికృష్ణ మాట్లాడి అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని (Hanuman birth place) నిరూపించే ఆధారాలను తెలియజేశారు. పండిత పరిషత్ కార్యదర్శి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, సభ్యులు ఆచార్య రాణిసదాశివమూర్తి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: