ETV Bharat / city

Hanuman birth place: ఆంజనేయుడి జ‌న్మక్షేత్రంపై తితిదే వెబినార్.. ఎప్పుడంటే? - తిరుమల తాజా వార్తలు

హ‌నుమంతుడి జ‌న్మక్షేత్రంపై(Hanuman birth place) ఈనెల 30, 31 తేదీల్లో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వెబినార్‌ నిర్వహించనుంది. ఎస్వీ ఉన్నత వేదాధ్యయ‌న సంస్థ ఆధ్వర్యంలో వెబినార్‌(webinar) నిర్వహణ ఉంటుంది.

hanuman
hanuman
author img

By

Published : Jul 8, 2021, 8:48 PM IST

అంజనీ పుత్రుడి జన్మస్థలంపై జరుగుతున్న చర్చను.. తిరుమల తిరుపతి దేవస్థానం మరింత ముందుకు తీసుకుపోనుంది. తిరుమల సప్తగిరుల్లోని అంజనాద్రే.. ఆంజనేయుడి జన్మస్థలమని ఇప్పటివరకూ వాదిస్తూ వచ్చిన తితిదే.. ఈ విషయమై వెబినార్ (TTD Webinar) నిర్వహణకు సిద్ధమైంది.

ఈ నెల 30, 31 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తితిదే ప్రకటించింది. వెబినార్‌లో మ‌ఠాధిప‌తులు, వివిధ వర్సిటీల ప‌రిశోధ‌కులు పాల్గొననున్నారు. వెబినార్‌లో హనుమ జ‌న్మస్థలం ప్రామాణిక‌తపై చర్చ జరగనుంది. తిరుమలతో(tirumala) అంజనేయునికి ఉన్న పురాణ సంబంధాలపై ఈ వెబినార్​లో మాట్లాడనున్నారు.

ఇదీ చదవండి:

పోలవరం నిర్మాణంపై.. ఎన్జీటీ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.