తిరుమలలో గదుల కేటాయింపులో కాషన్ డిపాజిట్ విధానాన్ని తితిదే మళ్లీ ప్రారంభించింది. అద్దె గదులు పొందే వారి నుంచి 500 రూపాయలకన్నా తక్కువ ఉన్న గదులకు 500 రూపాయలు.. అంతకన్నా ఎక్కువ ఉన్న గదులకు అద్దెకు సమానంగా డిపాజిట్ ను వసూలు చేస్తున్నారు. 2017వ సంవత్సరంలో భక్తుల సౌకర్యార్థం ఈ విధానంను రద్దు చేశారు. నేటి నుంచి మరలా తిరిగి ప్రారంభించారు. గదులు కేటాయించే సమయంలోనే అద్దెతో పాటు కాషన్ డిపాజిట్‌ను వసూలు చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్‌ను మాత్రమే అమలు చేస్తున్న తితిదే.. గది ఖాళీ చేసిన తరువాత వారి బ్యాక్ ఖాతాకు డిపాజిట్ మొత్తం తిరిగి చేరేలా సాంకేతికతను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండీ.. PULICHINTALA: పులిచింతల నుంచి భారీగా నీటి విడుదలకు అధికారుల సన్నాహాలు