ETV Bharat / city

TTD: నేడు తితిదే పాలకమండలి ప్రకటన ! - తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల నియామకం

నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొలువుతీరనున్నట్లు తెలిసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్​ను కలిసిన తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి.. మండలి సభ్యుల జాబితాపై సంమగ్రంగా చర్చించారు. పాత బోర్డు ప్రకారమే సభ్యుల సంఖ్యను 24కి పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

TTD Governing Council members finalized
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి
author img

By

Published : Sep 15, 2021, 4:30 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం(ttd) ధర్మకర్తల మండలి సభ్యుల జాబితాను ప్రభుత్వం ఇవాళ ప్రకటించనున్నట్లు తెలిసింది. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిశారు. ఇప్పటికే సిద్ధమైన సభ్యుల జాబితాపై సమగ్రంగా చర్చించారు. ప్రస్తుతానికి పాత బోర్డు ప్రకారమే సభ్యుల సంఖ్యను 24కి పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా మరి కొందరికి చోటు కల్పించవచ్చని తెలిసింది. తెలంగాణ నుంచి ఐదుగురికి అవకాశం ఇవ్వగా.. వారిలో ఒకరు ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. తమిళనాడు నుంచి కూడా ఒక ఎమ్మెల్యేను తీసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డు సభ్యత్వానికి పెద్దఎత్తున విజ్ఞాపనలు, సిఫార్సులు వచ్చాయని, ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక ఆహ్వానితుల జాబితా పెరగవచ్చని సిఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 19న పాలకమండలి సమావేశంలో ఈ సంఖ్యపై తీర్మానం చేయవచ్చని సమాచారం.

ఇదీ చదవండి..

TIRUMALA: తిరుమలలో పరమళభరితమైన అగరబత్తీల అమ్మకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.