తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం డిప్యూటీ ఈవో కె .నాగరాజు (60) కరోనా బారినపడి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. తితిదే అన్నప్రసాద ట్రస్టు డిప్యూటీ ఈవోగా ఏడాదిన్నరగా పని చేస్తున్నారు. గతంలోనూ గుండెకు సంబంధించిన అనారోగ్యంతో ఇబ్బందిపడిన ఆయన చికిత్స అనంతరం కోలుకుని తితిదే విధుల్లోకి చేరారు. జూన్లో పదవీ విరమణ పొందాల్సి ఉన్న తరుణంలో మృతి చెందడం ఆయన కుటుంబ సభ్యులను కలచివేస్తోంది.
ఇదీ చదవండి