పేద యువతీయువకులకు గతంలో సామూహిక వివాహాలు జరిపించిన కల్యాణమస్తు కార్యక్రమాన్ని నూతన విధివిధానాలతో తిరిగి ప్రారంభించాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవన్లో అధికారులతో కలిసి హిందూ ధార్మికప్రచార పరిషత్ కార్యక్రమాలపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కార్తీక దీపోత్సవం రోజున తిరుమలలో తొలిసారిగా మలయప్ప స్వామికి కార్తీక దీపనీరాజనం పేరుతో నాలుగు మాడవీధుల్లో దీపాలు వెలిగించాలనే అంశంపై చర్చించారు.
జిల్లా ధర్మప్రచార మండలిని ఏర్పాటు చేసి స్థానికంగా ఆసక్తిగల భక్తులతో ధర్మప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ధర్మప్రచార కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేలా ఎస్వీబీసీ సహకారంతో విస్తృత ప్రచారానికి ప్రణాళికలు రచించుకోవాలని ఛైర్మన్ సూచించారు. తితిదే కల్యాణమండపాల్లో మందిరాలను నిర్మించి సాయంత్రం వేళల్లో భజన కార్యక్రమాలను నిర్వహించేలా చూడాలని అధికారులకు చెప్పారు.
ఇదీచదవండి