ETV Bharat / city

నేడు.. తితిదే ధర్మకర్తల మండలి కీలక సమావేశం

వచ్చే నెలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణతో పాటు, దర్శనాల సంఖ్య పెంపు, కార్పస్‌ ఫండ్‌ నుంచి నిధులు డ్రా చేయడం వంటి పలు కీలక అంశాలపై చర్చించడానికి తితిదే ధర్మకర్తల మండలి ఇవాళ సమావేశం అవుతోంది. కరోనా కారణంగా ధర్మకర్తల మండలి సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగే సమావేశంలో తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి పాల్గొననున్నారు. తితిదే చరిత్రలో తొలిసారిగా ధర్మకర్తల మండలి సమావేశాన్ని ఎస్వీబీసీ ఛానల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

నేడు.. తితిదే ధర్మకర్తల మండలి కీలక సమావేశం
నేడు.. తితిదే ధర్మకర్తల మండలి కీలక సమావేశం
author img

By

Published : Aug 28, 2020, 1:54 AM IST

తిరుమల అన్నమయ్య భవనం వేదికగా తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ఇవాళ జరగనుంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 52 అంశాలతో కూడిన సుదీర్ఘ అజెండాతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సెప్టెంబర్‌ నెలలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణ, శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య పెంపు అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు మూడు నెలల పాటు భక్తుల దర్శనాలు నిలిపివేయడం....లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతి వంటి సమస్యలతో తితిదే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఆలయ నిర్వహణ, తితిదే ఉద్యోగుల జీతభత్యాల అంశాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇవాళ జరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నారు.

నిధులు డ్రా పై చర్చ

ఆగస్టు నెల జీతాల చెల్లింపు వరకు ఆర్థిక ఇబ్బందులు లేవని, సెప్టెంబర్‌ జీతాలకు సబంధించి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఈవో ప్రకటించారు. దీంతో ఇవాళ్టి సమావేశంలో కార్పస్‌ ఫండ్‌ డ్రా చేయడానికి ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేయనుంది. రోజుకు తొమ్మిది వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తుండగా ఈ సంఖ్యను 20 వేలకు పెంచే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు.

సమావేశం ప్రత్యక్షప్రసారం

కరోనా ఉద్ధృతి వల్ల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఇతర తితిదే అధికారులు నేరుగా పాల్గొననున్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు ఆన్‌లైన్‌లో సమావేశానికి హాజరవుతారు. తితిదే చరిత్రలో తొలిసారిగా తితిదే ధర్మకర్తల మండలి సమావేశాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ఇదీ చదవండి : ఆర్థిక వనరుల సమీకరణకు ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.