తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని.. దిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలిగా తితిదే నియమించింది. ఈ బాధ్యతల ద్వారా.. ఉత్తర భారతదేశంలోని తితిదే ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలను ఆమె నిర్వర్తించనున్నారు. ఈ నేపథ్యంలో.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచనల మేరకు బోర్డు సభ్యత్వానికి ప్రశాంతిరెడ్డి రాజీనామా సమర్పించారు.
ఇదిలాఉంటే.. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు కల్పించే ప్రత్యేక దర్శనాల విషయంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత సంవత్సరం మార్చి 20 నుంచి.. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశామని తితిదే తెలిపింది. అయితే.. ఇప్పటికీ కొవిడ్ పూర్తిగా అదుపులోకి రాకనందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : Delhi to Tirupati: దిల్లీ-తిరుపతి మధ్య తొలి నాన్‌స్టాప్ విమానం