తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలపై.. జీబీపీ రెడ్డి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆక్సిజన్ అందక 11 మందే మృతి చెందారని ప్రభుత్వం పేర్కొనడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. మృతుల సంఖ్యను గోప్యంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. వేసవి సెలవుల అనంతరం ఈ అంశంపై విచారణ జరుపుతామని స్పష్టంచేసింది.
ఇదీ చదవండి: ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా అందుబాటులోకి తీసుకురండి: హైకోర్టు