ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

top news @ 3 pm
ప్రధాన వార్తలు @ 3 pm
author img

By

Published : Mar 27, 2021, 3:01 PM IST

  • పదవికి రాజీనామా
    సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా చేశారు. రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. నీలం సాహ్ని ఈ నెలాఖరున ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఆ విద్యాసంస్థలను మూసేయాలి'
    కొవిడ్‌ కేసులు వెలుగుచూసిన విద్యాసంస్థలు మూసేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అమానుషం
    ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలికి నమ్మకంగా మారినట్లు నటించాడు. అదను చూసి.. అవ్వను హత్య చేసి.. బంగారు వస్తువులతో ఉడాయించాడు. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లా హుకుంపేటలోని ఆదర్శనగర్​లో జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'వేదం' నాగయ్య కన్నుమూత
    ప్రముఖ నటుడు వేదం నాగయ్య తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు జిల్లా బేచవరంలోని నివాసంలో కన్నుమూశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నిలకడగా...
    రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి బులెటిన్​ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. అయితే మరిన్ని పరీక్షల కోసం ఎయిమ్స్​ ఆస్పత్రికి వెళ్లాలని సిఫార్సు చేస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అసోం పోల్స్​
    అసోంలో శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. కొవిడ్​ దృష్ట్యా పలు జాగ్రత్తలు పాటిస్తూ ఓటింగ్​కు​ హాజరవుతున్నారు ఓటర్లు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ప్రపంచ శాంతే భారత్​, బంగ్లాదేశ్​ ఆకాంక్ష'
    బంగ్లాదేశ్​ ఓరకండిలోని హరిచంద్​-గురుచంద్​ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనంతరం మతువా వర్గం ప్రజలతో సమావేశమయ్యారు. భారత్, బంగ్లాదేశ్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, ప్రేమ, స్థిరత్వాలను కోరుకుంటున్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బంగారంతో ఇబ్బందే!
    బంగారం అంటే ఇష్టపడనివారుండరు. ఎలాంటి శుభకార్యమైనా ఆడవారి మెడలో బంగారు ఆభరణాలు మెరుస్తుంటాయి. ఇటీవల మగవారు సైతం వాటిపై మక్కువ పెంచుకుంటున్నారు. అయితే.. ఒక్కొక్కరి వద్ద ఎంత బంగారం ఉండొచ్చు? ఎక్కువ ఉంటే ఏం చేయాలి? చట్టాలు ఏం చెబుతున్నాయి? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'అతి జాగ్రత్తే కొంప ముంచింది'
    భారత్​తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం వల్లనే టీమ్ఇండియా ఓటమి పాలైందని విమర్శించాడు ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • విడుదల వాయిదా
    కబడ్డీ నేపథ్య కథతో తీసిన 'సీటీమార్' కొత్త రిలీజ్​ తేదీని త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు సంపత్ నంది చెప్పారు. ఇందులో గోపీచంద్-తమన్నా జంటగా నటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.