ETV Bharat / city

తిరుపతి: పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న జాతీయ విద్యాసంస్థలు - National educational institutions in Tirupati News

అత్యున్నత సాంకేతికతను నేటి తరానికి చేరువ చేయటమే లక్ష్యంగా ఏర్పాటైన విద్యా సంస్థలవి. పునర్విభజన చట్టం హామీల్లో భాగంగా రాష్ట్రానికి దక్కిన ఆ రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యాసంస్థలు... కొంత కాలంగా పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. తిరునగరికే మణిహారంగా నిలిచే ఆ సంస్థలను త్వరితగతిన పూర్తి చేయాలనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉంటున్నా.. లోక్​సభ నియోజకవర్గ ఉపఎన్నిక వేళ మళ్లీ అదే డిమాండ్ పునరావృతం అవుతోంది. మేం చేస్తామంటే మేం చేస్తామంటూ... అన్ని పార్టీల అభ్యర్థులు హామీలు గుప్పిస్తున్న వేళ... ఐఐటీ తిరుపతి, ఐసర్ తిరుపతిల ప్రస్తుత పరిస్థితిపై ప్రత్యేక కథనం.

జాతీయ విద్యాసంస్థలు
జాతీయ విద్యాసంస్థలు
author img

By

Published : Apr 4, 2021, 5:48 PM IST

జాతీయ విద్యాసంస్థలపై పలు పార్టీల ప్రతినిధుల కామెంట్స్

దేశంలోనే అత్యున్నత సాంకేతిక విద్యా నిపుణులను తీర్చిదిద్దాల్సిన సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఐఐటీ తిరుపతి, విజ్ఞాన శాస్త్ర రంగంలో అత్యున్నత పరిశోధక విద్యార్థులను తయారు చేయాల్సిన సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-ఐసర్ తిరుపతి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా ఇచ్చిన హామీల మేరకు కేంద్రం ఆధ్యాత్మిక నగరం తిరుపతికి కేటాయించిన ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యాసంస్థలివి. బాలారిష్టాలు అన్నీ దాటుకుని పనులు ప్రారంభమై ఆరేళ్లు కావస్తున్నా... ఇప్పటికీ ఈ విద్యాసంస్థలు శాశ్వత నిర్మాణాలను పూర్తి చేసుకోలేదు. కొంతలో కొంత మెరుగు అన్నట్లు ఐఐటీ తిరుపతి శాశ్వత భవనాల నిర్మాణాల్లో పురోగతి కనిపిస్తున్నా... పాలకుల నిర్లక్ష్యంతో పనులు వేగంగా జరగటం లేదని సమాచార హక్కు చట్టమే స్పష్టం చేస్తోంది. ఐసర్ తిరుపతి పరిస్థితి మరింత శోచనీయం. ఆరేళ్ల కిందటే శాశ్వత భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించినా.. ఒక్క పరిపాలనా భవనం తప్ప... మిగిలిన కార్యకలాపాలు అన్నీ అద్దెగదుల్లోనే కొనసాగుతుండడం.. క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతోంది.

గత ప్రభుత్వంలో శంకుస్థాపన

ఐఐటీ తిరుపతి విషయానికి వస్తే.. 2015 మార్చిలో కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అత్యున్నత విద్యా సంస్థకు శంకుస్థాపన చేశారు. 3 వేల 125 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ సంస్థ... తొలుత రేణిగుంట సమీపంలో తాత్కాలిక ప్రాంగణంలో ప్రారంభమైంది. అనంతరం ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద 566 ఎకరాల ప్రభుత్వ భూమిని నాటి చంద్రబాబు సర్కారు ఐఐటీకి కేటాయించింది. 8 కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మించింది. ఇంత చేసినా... కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధుల్లో జాప్యం జరుగుతోందని పార్టీలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. అయినా.. ఫలితం లేకుండా పోతోంది.

ఐదేళ్ల కాలంలో.. విడుదలైన నిధులు రూ.555 కోట్లే...

2017-18 సంవత్సరంలో ఎన్డీఏ సర్కారు నుంచి తెదేపా బయటకు వచ్చిన సమయంలో కేంద్ర బడ్జెట్​లో 98కోట్ల రూపాయలు ఐఐటీకి కేటాయించగా... 2018-19 బడ్జెట2లో 50 కోట్ల రూపాయల నిధులు మాత్రమే కేటాయించారు. ఐదేళ్ల కాలంలో కేవలం 555 కోట్ల రూపాయలు నిధులు మాత్రమే విడుదల కాగా... శాశ్వత తరగతి గదులు, వసతిగృహాలు మాత్రమే ఈ ఐదేళ్లలో పూర్తయ్యాయి. హక్కుగా రావాల్సిన నిధులు రాబట్టుకోవటంలో వైకాపా సర్కారు విఫలమైనట్లుగా సమాచార హక్కు చట్టం స్పష్టం చేస్తోంది. గడచిన రెండేళ్లలో తిరుపతి ఐఐటీకి నిధులు విడుదల చేయాలంటూ ఒక్క అభ్యర్థన కూడా రాలేదని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉన్నత విద్యామండలి నుంచి సమాధానం రావటం.. పాలకుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది.

ఐసర్ పరిస్థితి మరింత దైన్యం

ఐఐటీతో పోలిస్తే ఐసర్ తిరుపతి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 2015లోనే శంకుస్థాపన మహోత్సవాన్ని జరుపుకొన్న ఐసర్​కు 2018 వరకూ 109 కోట్ల రూపాయల నిధులు విడుదల కాగా... 2018-19 సంవత్సరంలో 49 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు జరిగాయి. ఐసర్​కి వస్తున్న నిధుల మొత్తం గణనీయంగా తగ్గిపోతున్న పరిస్థితుల్లో... నేటికీ తిరుపతి శివారు కరకంబాడీ ప్రాంతంలో ఓ కళాశాలకు సంబంధించిన అద్దె భవనాల్లో తరగతులు జరుగుతున్నాయి. ఐసర్ తిరుపతికి సైతం ఏర్పేడు మండంలోని శ్రీనివాసపురం వద్ద 255 ఎకరాల భూ కేటాయింపులు జరిగినా... అక్కడ ఇప్పటివరకూ పరిపాలనా భవనం తప్ప మరో గది నిర్మాణమైన దాఖలాలే కనిపించటం లేదు.

ఆరేళ్లు గడుస్తున్నా.. శాశ్వత భవనాలకు దిక్కు లేదు

తిరుపతి లోక్​సభ నియోజకవర్గానికి మణిహారాల్లాంటి రెండు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ఉన్నా... ఆరేళ్ల కాలం గడుస్తున్నా ఇప్పటికీ శాశ్వత భవనాలు పూర్తికాకపోవటం పలు విమర్శలకు దారితీస్తోంది. ఎంపీలు... రాష్ట్రానికి హక్కుగా వచ్చిన జాతీయ విద్యాసంస్థలకు నిధులు తీసుకురావటంలో విఫలమతున్నారని పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక తరుణంలో... ఈ విద్యాసంస్థల పురోగతి పై ప్రశ్నలు ఎదురుకాగా...పూర్తి స్థాయిలో నిధులు రాబడతామని తెలుగుదేశం ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్డీయే నుంచి బయటకు రావటంతో... కక్ష సాధింపు చర్యలకు భాజపా దిగిందని చెబుతున్న తెదేపా నాయకులు... వైకాపాకు 22మంది ఎంపీలున్నా శాశ్వత భవనాలను నిర్మించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. వామపక్ష పార్టీలు సైతం భాజపా విధానాలను తప్పుపడుతున్నాయి. సీపీఎం అభ్యర్థిని ఎంపీగా గెలిపిస్తే జాతీయ విద్యాసంస్థలను పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని చెబుతున్నారు.

నిధుల లేమి ఉంటే.. ఎందుగు అడగట్లేదు?: భాజపా

జాతీయ విద్యాసంస్థలను పూర్తి చేసేందుకు భాజపా కట్టుబడి ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దేశంలోని మిగిలిన జాతీయ విద్యాసంస్థలతో పోల్చి చూస్తే... ఐఐటీ తిరుపతి, ఐసర్ తిరుపతి శాశ్వత భవనాల నిర్మాణాలు వేగంగానే జరుగుతున్నాయని చెబుతున్నారు. అవసరమైన మేర ఖర్చులకు సరిపడా ఏటా నిధుల కేటాయింపు జరుగుతుందని చెబుతున్న భాజపా నాయకులు... నిధుల లేమి ఉంటే ఆయా విద్యాసంస్థల నిర్వాహకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగకుండా... రెండు జాతీయ స్థాయి విద్యాసంస్థలను త్వరితగతిన పూర్తి చేయటం ద్వారా ఈ ప్రాంతాన్ని అత్యున్నత సాంకేతిక విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలని తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పవన్ రాష్ట్రానికి అద్దె మైకులా తయారయ్యారు: పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.