ETV Bharat / city

చివరి అంకానికి చేరుకున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక - Tirupati Lok Sabha by-election Polling

రాష్ట్రమంతటా ఆసక్తి రేకెత్తిస్తున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం గురువారం రాత్రి ఏడింటితో ముగిసింది. శనివారం పోలింగ్‌ జరగనుంది. భారీ మెజారిటీతో గెలిచి ఆధిక్యం నిలబెట్టుకోవాలని అధికార పార్టీ వైకాపా, విజయం సాధించి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను చాటాలని ప్రధాన ప్రతిపక్షం తెదేపా పట్టుదలతో పోరాడుతున్నాయి. ఎన్నికలను భాజపా, కాంగ్రెస్‌ కూడా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. పోటీ మాత్రం ప్రధానంగా వైకాపా, తెదేపాల మధ్యే ఉంది.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక
author img

By

Published : Apr 16, 2021, 5:20 AM IST

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఎన్నికల ప్రచారం గురువారం ముగిసింది. ప్రధాన పార్టీల తరఫున తిరుపతి పార్లమెంటు పరిధి ఉన్న చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ముఖ్య నేతలు ప్రచారం చేశారు. తిరుపతిలో చంద్రబాబు ప్రచార సభలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడం, అది వైకాపా పనేనని, పోలీసులు స్పందించలేదని తెదేపా అధినేత రోడ్డుపైనే నిరసనకు దిగడం వంటి సంఘటనలు రాజకీయ వేడిని పెంచాయి. వైఎస్‌ వివేకా హత్యతో తమకు సంబంధం లేదని ప్రమాణం చేస్తానని, సీఎం జగన్‌ కూడా ప్రమాణం చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సవాలు విసిరారు. రాళ్ల దాడి పేరుతో చంద్రబాబు, ప్రమాణం పేరుతో లోకేశ్‌ కొత్త నాటకానికి తెర తీశారని వైకాపా నాయకులు విమర్శించారు. వైకాపా అభ్యర్థి గురుమూర్తి ఎస్సీ కాదని ఆరోపించడం ద్వారా భాజపా మరో వివాదానికి తెరలేపింది. అవి రాజకీయ ప్రయోజనాలకు చేస్తున్న ఆరోపణలేనని వైకాపా తిప్పికొట్టింది.

వైకాపా ప్రచారాన్ని మంత్రులే నడిపించారు.. తిరుపతిలో ఐదు లక్షలకుపైగా ఆధిక్యం సాధించడమే లక్ష్యమని ప్రకటించుకున్న వైకాపా.. ఏడెనిమిది మంది మంత్రులను, పలువురు శాసనసభ్యులను రంగంలోకి దింపింది. ప్రచార బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షించారు. మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్‌ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. నవరత్నాలతోపాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులు ప్రచారం చేశాయి. ముఖ్యమంత్రి జగన్‌ ఈ నెల 14న తిరుపతిలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించాలని మొదట నిర్ణయించి.. తర్వాత రద్దు చేసుకున్నారు. సభ పెడితే కరోనా వ్యాపిస్తుందన్న ఉద్దేశంతోనే రద్దు చేసుకున్నానంటూ నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు. పార్టీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలంటూ అంతకుముందూ లేఖ రాశారు. ముఖ్యమంత్రి రాసిన లేఖలను వాలంటీర్లు ఇంటింటికీ అందజేశారని, అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని తెదేపా ఆరోపించింది.

చంద్రబాబు విస్తృత ప్రచారం: తెదేపా అధినేత చంద్రబాబు ఈనెల 8 నుంచి 15వ తేదీ వరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనే మకాం వేసి ప్రచారం చేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, లోకేశ్‌ సహా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తిరుపతిలోనే మకాం వేసి ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని.. ఒక్క పరిశ్రమా రాలేదని, తిరుమల పవిత్రతను మంటగలుపుతోందని తెదేపా ధ్వజమెత్తింది. తెదేపా హయాంలో తిరుపతి, సత్యవేడువంటి చోట్ల జరిగిన పారిశ్రామికాభివృద్ధిపై ప్రచారం చేసింది. 22 మంది ఎంపీల్ని గెలిపించినా.. వైకాపా ప్రత్యేక హోదా తేలేకపోయిందని ధ్వజమెత్తింది. తిరుపతి నియోజకవర్గ పరిధిలో 2లక్షల నకిలీ ఓటరు గుర్తింపు కార్డులున్నాయని, పోలింగ్‌ రోజున అక్రమాలు జరగకుండా నిరోధించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించింది.

రంగంలోకి భాజపా సీనియర్‌ నేతలు: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, నాయకులు తిరుపతిలో మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించారు. భాజపా, జనసేన శ్రేణులతో కలిసి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తిరుపతిలో ప్రచార సభ నిర్వహించారు. నాయుడుపేట సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా పాల్గొన్నారు. రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన ప్రగతి పనులపై భాజపా ప్రచారం చేసుకుంది.

చింతా మోహన్‌ ఒంటరి పోరాటం: కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌ దాదాపు ఒంటరి పోరాటమే చేస్తున్నారు. ఆయన తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌, తులసిరెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
* బరిలో 28 మంది ఉన్నారు.
* తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలో మొత్తం ఓటర్లు: 17,11,195
* పోలింగ్‌ సమయం: శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.