నిబంధనల అతిక్రమణ, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా తెదేపా తలపెట్టిన ధర్మ పరిరక్షణ ప్రచార యాత్రను అనుమతి ఇవ్వలేదని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులపై తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలను ఎస్పీ ఖండించారు. కేవలం 100మందితో శాంతి యుతంగా ర్యాలీ నిర్వహించేదుకు అనుమతిచ్చామన్న ఎస్పీ.. మైక్సెట్లు, బైక్ ర్యాలీలతో తెదేపా నేతలు ఆధ్యాత్మిక వాతావరణంలో హడావిడి సృష్టించారన్నారు. కొవిడ్ నిబంధనలకు సైతం విఘాతం కలిగే అవకాశం ఉండటంతో తెదేపా నేతలను ఎక్కడిక్కడ అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: పట్టుదలతోనే ఉన్నత స్థానం: ఎస్పీ రమేష్ రెడ్డి